Vote | ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు : తలసాని శ్రీనివాస్ యాదవ్
Vote | ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Vote | ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పీజీ రోడ్డులో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి అనడం సరైంది కాదన్నారు. అర్హులైన నూతన గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే విధానం రావాలన్నారు. 50, 60 సంవత్సరాల గ్రాడ్యుయేట్ లు కూడా ప్రతిసారి ఓటు నమోదు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయి. భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించారు. ఓట్లను తొలగించే అధికారం ఎవరిచ్చారు? దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కూడా ఎన్నికల కమిషన్ వైఖరిని తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 తేదీ లోగా అర్హులైన గ్రాడ్యుయేట్ లు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

