హైదరాబాద్ : నీతికి, నిజాయితీకి మారుపేరు యాదవులు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పదిర మండల కేంద్రంలో శ్రీ కృష్ణుడి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ కృష్ణుడు, రుక్మిణి సత్యభామలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహాభారతం అంత చరిత్ర యాదవులకు ఉంద్నారు.
రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, మీకు ఏ అవసరమొచ్చినా నేను ఉన్నాను అనే విషయాన్ని మరావొద్దు అన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మొదట తెరచేది యాదవుడే. యాదవులు అంతా ఐక్యంగా ఉండాలి. దేశంలో, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జాతి యాదవులదని అన్నారు.