అమీర్పేట: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. జూలై 1న జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ విభాగాల అధికారులతో కలిసి దేవాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తలసాని అధికారులకు పలు సూచనలు చేశారు.
2న జరిగే అమ్మవారి రథోత్సవం కొనసాగే మార్గంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.