హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ సిద్దాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యంలో ఆయన పాత్ర మరువలేనిదని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బన్సీలాల్పేట డివిజన్ బోయగూడలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వినిపించారని గుర్తుచేశారు. తెలంగాణ సాధనకోసం చివరిదాకా పోరాటంచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్.. రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే కన్నుమూయడం బాధాకరని చెప్పారు.