సిటీబ్యూరో, అక్టోబరు 10 (నమస్తే తెలంగాణ) : బంధుత్వం వేరు..రాజకీయం వేరే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విషయంలో వస్తున్న అనుమానాలు, అపోహలకు శుక్రవారం తలసాని క్లారిటీ ఇచ్చారు. నవీన్యాదవ్తో బంధుత్వం వేరు.. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అనుబంధం వేరని చెప్పారు.
నవీన్‌తో తనకు బంధుత్వం ఉన్న మాట వాస్తమేనని.. గతంలో అతడికి రాజకీయ సూచనలు ఇచ్చానని గుర్తు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, గురువారం జరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా కేటీఆర్‌తో కలిసి బస్ భవన్‌కు వెళ్లాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నాని తలసాని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.