సర్వే మళ్లీ నిర్వహించాలి
బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 6: కుల గణన సర్వే తిరిగి నిర్వహించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన పద్మారావునగర్‌లో మీడియాతో గురువారం మాట్లాడుతూ 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో నిర్వహించిన కుల గణన సర్వేకు జనాభా లెక్కలలో భారీ వ్యత్యాసం ఉన్నదన్నారు. పదేండ్ల తరువాత జనాభా 62 లక్షలు తగ్గిందని, వారంతా ఎటుపోయారో ప్రభుత్వమే చెప్పాలని ఆయన అన్నారు. కుల గణన అంతా తప్పుల తడకగా, గందరగోళంగా ఉన్నందున తిరిగి సర్వే చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే మద్దతు ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. వర్గీకరణ అనంతరం, ఎస్సీలలో నెలకొన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తలసాని అన్నారు.
బీసీల కుల గణన అంతా బూటకం
మల్కాజిగిరి, ఫిబ్రవరి 6: బీసీల కుల గణన సరిగా జరగలేదని, అదంతా బూటకమని బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ సఫిల్‌గూడలోని కార్యాలయంలో బీసీ కులాల ఐక్య వేదిక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే తప్పుడు తడకలా ఉందన్నారు. బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని, బీసీలు అధిక జనాభా కలిగి ఉండి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిలో వివక్షకు నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాజ్యాధికారంలో న్యాయమైన వాటా సాధించేవకు పోరాడుతామని ఆయన అన్నారు. 8న ఆనంద్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమేశ్ గౌడ్, రామ్మోహన్, నాగరాజు, నవీన్, శ్రీనివాస్, దశరథ్, వెంకటయ్య, లక్ష్మీనారాయణ, గోపాల్, నరసింహాచారి, కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల రిజర్వేషన్లపై చట్టం చేయాలి
రవీంద్రభారతి, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన కుల గణన వాస్తవాలు పూర్తి అసత్యంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. బీసీల పొట్ట గొట్టి, ఓసీలను పెంచి పోషించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల జనాభా 56 శాతం ఉందని, 1978 నుంచి చేసి ప్రతి సర్వే లో తేలిందని, కాని, 10% కోతపెట్టి 46%గా లెక్కలు చూపిస్తున్నారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 6.5% ఉన్న ఓసీలను మాత్రం 16 శాతం చూపిస్తూ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు లెక్కల గారడి చేశారని విమర్శించారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన డి మాండ్ చేశారు. బీసీలకు మోసం చేసే పార్టీలకు మనుగడ ఉండదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీసీలు బొందపెట్టడం ఖాయమన్నా రు. జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాం ధీ ప్రతిరోజు ఓబీసీల కుల గణన చేయాలని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బీసీల జనాభా లెక్కలు తగ్గించి మరోమారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్నారు. తక్షణమే కుల గణనపై రీసర్వే చేయించి 42 % రిజర్వేషన్ల చట్టం చేసి, ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నారు. కార్యక్రమంలో గొరిగే మల్లేశ్, వి.రామకృష్ణ, కె.జనార్ధన్, సుధాకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.