Danam Nagender | బంజారాహిల్స్, మార్చి 5 : జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్, దీన్ దయాళ్‌నగర్ బస్తీల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డిని ఆదేశించారు.
బుధవారం బస్తీకి చెందిన పలువురు స్థానికులు, నేతలు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి కబ్జాలపై ఫిర్యాదులు చేశారు. వినాయక్‌నగర్ పర్వతాంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు వెలుస్తున్నా రెవెన్యూ సిబ్బంది స్పందించడం లేదని వారు పేర్కొన్నారు. ఆక్రమణలను తొలగించడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోపై విచారణ చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి ఆదేశించారు. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఎలాంటి పక్షపాతం చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బస్తీనేతలు బాబురావు తదితరులు పాల్గొన్నారు.