సిటీబ్యూరో: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.
శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో స్థానిక డీసీపీలు, ఏసీపీలతో పాటు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, ఎలక్ట్రిసిటీ విభాగాలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు.