హైదరాబాద్ : మలక్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష అనుమానస్పద స్థితిలో మృతి చెందింది(Suspicious death). మృతురాలి భర్త వినయ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలో దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి
మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష అనుమానస్పద స్థితిలో మృతి
గుండెపోటు అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భర్త వినయ్ కుమార్.. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలో… pic.twitter.com/xpC2qqnYLM
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2025