శేరిలింగంపల్లి, జనవరి 19 : బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులు(Bar licenses) ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిని నిందితుడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ అధికారులు బాగా తెలుసని చెపుతూ కొందరు రాయదుర్గం పరిధిలో బార్ లైసెన్సుల అనుమతుల పేరిట ఇద్దరిని నమ్మించి రూ.80 లక్షల కాజేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రదాన నిందితుడు కొండంగల్కు చెందిన జీ.వెంకటపవన్తో పాటు ఎక్సైజ్ అధికారులుగా బాధితులతో మాట్లాడిన మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కాపేట ప్రాంతానికి చెందిన నాగార్జున, కొంపల్లి ప్రాంతానికి చెందిన ధర్మారెడ్డిలను వెంకటపవన్ నమ్మించి రూ. 80 లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీంతో భాదితులు రాయదుర్గం పోలీసులను శనివారం అశ్రయించిన విషయం విదితమే. ఈ మేరకు నిందితుడు వెంకటపవన్పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదివారం అతడితో పాటు కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.