హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదర్థాలు, కొవ్వు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈనెల 14, 15న ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డా.సంగీత సత్యనారాయణ వెల్లడించారు.
హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 14 సంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 65 సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారని, మొత్తం 91 నెయ్యి నమునాలను సేకరించి పరీక్షలకు పంపించినట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు.