Water Supply | సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్‌సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంటల వరకు మరమ్మతు పనులు నిర్వహించాలని జలమండలి తొలుత నిర్ణయించింది. ఐతే ఈ పనులను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.