హైదరాబాద్: ట్యాంక్ బండ్పై ప్రతివారం జరుగుతున్న సండే- ఫన్డే (Sunday Funday) కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీపీ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. సండే – ఫన్డే ఏర్పాట్లపై సమీక్షించారు. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.
చార్మినార్ వద్ద కూడా సండే – ఫన్డే నిర్వహించాలని మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రజలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని అరవింద్ కుమార్ కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో చార్మినార్ వద్ద సండే – ఫన్డే నిర్వహించాలని నిర్ణయించారు.
“Ek Shaam Charminar ke naam”
— Arvind Kumar (@arvindkumar_ias) October 14, 2021
MP Hyderabad Janaab @asadowaisi, @CPHydCity & @balala_ahmed visited #Charminar precinct today to finalise arrangements for traffic free & pedestrian friendly program for coming Sunday.
Our effort is to make it a pleasant experience for all @KTRTRS pic.twitter.com/9lKdjDgKqY