e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ ఆదరణ అదిరింది.. పోటీ పెరిగింది

ఆదరణ అదిరింది.. పోటీ పెరిగింది

  • సండే-ఫన్‌డేకు పెరిగిన క్రేజీ
  • ట్యాంక్‌బండ్‌పై స్టాళ్ల ఏర్పాటుకు తీవ్ర ఆసక్తి

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఫన్‌డే కార్యక్రమాలకు సందర్శకుల నుంచి మరింత ఆదరణ పెరుగుతోంది. ఆర్మీ, పోలీసు బృందాల బ్యాండు మేళా, సాంస్కృతిక, జానపద కళాకారుల ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు అలరిస్తున్నాయి. పాతబస్తీ షాపింగ్‌ ప్రత్యేకాకర్షణ. ప్రతివారం సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. హ్యాండిక్రాఫ్ట్స్‌, హ్యాండ్లూమ్‌ , తినుబండారాలు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు అనేకమంది ముందుకొస్తున్నారు. ప్రతి సోమ, మంగళవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో లేదా detailsto2ps-maud@telangana.gov.in,-maud@telangana.gov.in, hciphmda@gmail.com లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి కేటగిరీలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు ప్రకటించారు. నామమాత్రపు రుసుంతో అనుమతిస్తామని, ఎమ్మార్పీకే వస్తువులు విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement