బంజారాహిల్స్ : భార్యతో గొడవపడిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సంతోష్ బిస్వాల్ (27) టైల్స్ పనిచేస్తుంటాడు.
9నెలల క్రితం సంగీత అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కాగా గత కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 7న అర్థరాత్రి మద్యం సేవించి వచ్చిన సంతోష్ భార్యతో గొడవపడ్డాడు. మాటామాట పెరిగి భార్యపై చేయిచేసుకోవడంతో భయంతో ఆమె బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది.
చాలా సేపు పిలిచినా బయటకు రాకపోవడంతో ఆగ్రహానికి లోనయిన సంతోష్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతుడి సోదరుడు భిశ్వాల్ ప్రభాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.