మారేడ్పల్లి, ఆగస్టు 8: అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలెక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని.. ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంకాలనీకి చెందిన గరిశెట్టి వెంకటదుర్గ రామకృష్ణ (50) ప్రైవేట్ ఉద్యోగి. మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈనెల 5న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారం నంబర్-9లో ఆగి ఉన్న రైలెక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.