నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అందాల పోటీలా..!
జీవనోపాధి కరు వై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందా ల పోటీల్లో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.
- నూలుపై సబ్సిడీని జమ చేసి.. రుణమాఫీ అమలు చేయాలి
- సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం..
- చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు
మన్సురాబాద్, మే 18: జీవనోపాధి కరు వై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందా ల పోటీల్లో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మన్సురాబాద్ డివిజన్, సహారాస్టేట్స్ కాలనీలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ..
రాష్ట్రంలో చేనేత కార్మికులు పొద్దంతా పనిచేసినా పూటగడవక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోక పోగా కోట్లు ఖర్చుచేసి రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. చేనేత రుణాలు మాఫీ చేస్తామని, నూలుపై సబ్సిడీ ఇస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికి అమలు కావడంలేదని అన్నారు. నూలు పై సబ్సిడీని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేసి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులో త్రిఫ్ట్ పథకం గడువు ముగిసినా ఇప్పటి వరకు దానిని పునరుద్ధరించలేదని తెలిపారు.
జియో టాగ్ ఉన్న నేత కార్మికునితోపాటు ఇద్దరికి అనుబంధ కార్మికులకు కూడా త్రిప్ట్ పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. జియో టాగ్ పేరుతో కాలయాపన చేస్తూ నేత కార్మికులను భయాందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలు టెస్కో ద్వారా కొనుగోలు చేయడం తో పాటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమావేశం ప్రారంభంలో ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో, పాకిస్తాన్ సైన్యం దాడుల్లో, యుద్ధంలో మరణించిన సైనికులకు, ఈ మధ్య మరణించిన చేనేత కార్మికులకు సంతా ప తీర్మానం ప్రవేశపెట్టి రెండు నిముషాలు మౌనం పాటించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, బడుగు శంకరయ్య, గుండు వెంకటనర్సు, గుర్రం నర్సిం హ, సామలేటి రాజేందర్, చెన్న రాజేశ్, చిదిరాల నారాయణ, పెంటయ్య, శేఖరయ్య, గజం శ్రీశైలం, గంజి రామచంద్రం పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

