మల్కాజిగిరి, మే 8: పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మండల పరిధిలో పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను గురువారం ప్రాబెల్స్ స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేష్, మురుగేష్, మల్లికార్జున్, రావుల అంజయ్య, పుల్ల వెంకన్న, రాము యాదవ్, రమేష్, ప్రభాకర్, ఉపేందర్, నర్సింగ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్, రాజు, వెంకట్, ఉమాపతి, లక్ష్మి, సాయిగౌడ్, సుమన్, ఓంరాజు, బాబూరావు, విష్ణు, మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
నేరేడ్మెట్, మే 8: అభివృద్ధి పనుల విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అల్వాల్‌లో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, ఆయా విభాగాల అధికారులతో కలిసి గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంత్, డీఈ రఘు, ఏఈ రవళి, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్, క్రిష్ణమాచారి, రమేష్, డీఈ సుబ్బారెడ్డి, ఏడీఈ రామాచారి, 33 కేవీ డీఈ సునీల్, మాజీ ఎంబీసీ చైర్మన్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు డోలి రమస్త్రష్, అనిల్ కిషోర్ గౌడ్, లక్ష్మన్, శోభన్, పరమేష్, శ్రీనివాస్, అరుణ్, సురేష్, శరణ్ గిరి తదితరులు పాల్గొన్నారు.