కాప్రా : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Laxmareddy ) అన్నారు. బుధవారం మీర్పేట్ హెచ్బికాలనీ డివిజన్ తిరుమలనగర్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. చిలుకానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, పాల్గొన్నారు.