శేరిలింగంపల్లి, జూన్ 15: భవనంపై పడి హెచ్సీయూ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం కౌశిక్(22) అనే విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఐ హస్టల్ బ్లాక్ ఏ, రూమ్ నెంబర్ 202లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున అదే భవనం మూడవ అంతస్తు నుంచి జారీ స్లాగ్పై పడ్డాడు. దీంతో కౌశిక కు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని సిటిజన్ హస్పిటల్ కు తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు పడ్డాడా, లేక అతనే దూకాడా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.