Crime news | చదువుకోమన్నందుకు విద్యార్థి ఆత్మహత్య
Crime news | తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని చెప్పి నందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

హిమాయత్‌నగర్,అక్టోబర్26 : తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని చెప్పి నందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్‌కోఠి ఫర్ధాగేట్లో నివాసం ఉంటున్న ఎండీ అంజాద్‌ఖాన్, రజ్వీయ సుల్తానా దంపతుల కుమారుడు ఎండీ అక్బర్‌ఖాన్ (16) నగరంలో ఓ కాలే జీలో ఇంటర్మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు.
తనకు చదువుపై ఆసక్తి లేక పోయిన తల్లిదండ్రులు పదేపదే చదుకోమని చెప్పడంతో మనస్తాపం చెంది బెడ్ రూం లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రజ్వీయ సుల్తానా ఎంత పిలిచినా పలకలేదు.
దీంతో అనుమానం వచ్చి కిటికీ గ్రిల్స్‌ను తొలగించి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవా ఖానకు తరలించారు.
అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఎస్సై మధుసూదన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

