ఉప్పల్, సెప్టెంబర్ 17 : బర్త్డే బంప్స్ అంటూ.. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తపేట న్యూమారుతీనగర్లో ఉంటున్న విద్యార్థి నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లిన అతడు.. తరగతి గదిలో స్నేహితులతో కలిసి బర్త్డే బంప్స్ అనే ఆట ఆడారు. ఆ ఆటలో ఓ విద్యార్థి అతడి ప్రైవేటు భాగాలను మోకాలితో బలంగా కొట్టాడు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు గాయపడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు.