సిటీబ్యూరో: వినియోగదారుల హక్కులను పరిరక్షించే సీసీపీఏ(సెంట్రల్ కన్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) హోటళ్లు, రెస్టారెంట్లకు పలు విషయాల్లో హెచ్చరికలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ చార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించింది. అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.