Miyapur | మియాపూర్, మే 31 : వీధులలో విద్యుత్ దీపాల సమస్యలకు పరిష్కారం చూపాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్లో నూతన విద్యుత్ దీపాల అమరికను అధికారులు, కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడైన వాటి స్థానంలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన కాలనీలలో కొత్త స్తంభాలకు దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. దొంగతనాలు అరికట్టేందుకు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీటి కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ విభాగం డిఈ లక్ష్మీప్రియ, స్ట్రీట్ లైట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు లక్ష్మణ్, జితేందర్, కుమార్, మహమ్మద్ ఖాజా, రాజు, లక్ష్మణ్, ఖాజా, కల్పన, షఫీ, పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.