బాలానగర్, డిసెంబర్ 24: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఫతేనగర్ డివిజన్లో రూ.1.98 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్షయ్ ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని, నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల్లో కోట్లాది నిధులు కేటాయించి ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఎప్పుడూ లేని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం రూ.కోట్ల నిధులు కేటాయించి ైప్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మించినట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండ ఉండడం కోసం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో స్మశానవాటికల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ సతీశ్‌గౌడ్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫతేనగర్ డివిజన్లో ఇప్పటికే కోట్లాది నిధులు కేటాయించి అన్ని రకాల అభివృద్ధి పను లు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి, సుదర్శన్‌రెడ్డి, అంబటి శ్రీనివాస్, జగదీశ్, మల్లేశ్, రాం రెడ్డి, సాగర్, కన్నయ్య, సుధాకర్‌రెడ్డి, జ్యోతి, కవిత, ఉమ, కమలమ్మ, బాలమణి, రహీమ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీపీ ప్లాంట్ పనులు పరిశీలన..
బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రెయిన్బో విస్తా వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాలనీవాసులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వందల కోట్ల నిధులు కేటాయించి ఎస్టీపీ ప్లాంట్ (నీటి శుద్ధి కేంద్రం) పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్టీపీ ప్లాంట్ పనులను అతి త్వరలో పూర్తి చేసి తిరిగి తాగునీటిని చెరువుల్లోకి వదలనున్నట్లు తెలిపారు. తద్వార చెరువులలో దోమల బెడద చాలా వరకు తగ్గు ముఖం పడుతుందని తెలిపారు. చెరువులలో ఇతర బ్యాక్టీరియాల నుంచి కాపాడుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ప్రజా ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్టీపీ ప్లాంట్లను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్‌గౌడ్, అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.