ఎల్బీనగర్, జూన్ 17: అల్కాపురి కాలనీ స్ట్రామ్ వాటర్ పైప్ లైన్లను నాగోల్ మూసీ వరకు పూర్తి చేయాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ,ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి కోరారు. మంగళ వారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
ఎల్బీనగర్ నుంచి అల్కాపురి జంక్షన్ వరకు వేస్తున్నటువంటి స్ట్రామ్ వాటర్ పైప్ లైన్లను నాగోల్ మూసీలోకి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతూ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జోనల్ కమిషనర్ రూ. 25 కోట్ల రూపాయల అంచనాతో మంజూరు చేయడం జరిగిందని పైపు లైన్ పనులు త్వరగ పూర్తి చేయిస్తామని కార్పొరేటర్లకు తెలియజేశారు.