చిక్కడపల్లి, జూలై 18 : సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయం అవరణలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ నారాయణ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలె యాదయ్య, బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రూప్ సింగ్, కార్మిక శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, అడిషనల్ కమిషనర్ గంగాధర, జాయింట్ కమిషనర్లు గంగాధర్, చంద్రశేఖర్, సంయుక్త కమిషనర్ చతుర్వేది, డిప్యూటీ కమిషనర్ శ్యాంసుందర్ జాజు తదితరులు హాజరై నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నారాయణ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యులు బి.శివశంకర్, కే.శంకర్ రెడ్డి, ఎం.నర్సింహా, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాజిరెడ్డి, జయరాజ్, బీఆర్టీయూ నాయకులు కిరణ్, రమణరెడ్డి, దానకర్ణాచారి, ప్రభాకర్, వి.లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.