ప్రధాన రహదారుల అభివృద్ధికి చర్యలు : ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, మార్చి 16 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంగా పలు డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రధాన చౌరస్తాలను సుందరీకరిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, హెచ్‌సీఎల్ నుంచి చర్లపల్లి మీదుగా రాంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. చర్లపల్లి భరత్‌నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని, త్వరలో రైల్వే ఆర్ఓబీ బ్రిడ్జిను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ చర్లపల్లి, నాచారం డివిజన్ల అధ్యక్షులు డప్పు గిరిబాబు, ముత్యంరెడ్డి, నా యకులు గిరకబావి సురేఖ, మాణిక్, కర్రె సత్యనారాయణ, గరిక సుధాకర్, అనితారెడ్డి, రమాదేవి, కందికంటి శివ, రెడ్డినాయక్ తదితరులు పాల్గొన్నారు.