కందుకూరు, ఏప్రిల్ 29 : ప్రజల అవసరాలే ప్రభుత్వం ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గం కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కుల వృతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ ఎన్బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుమ్మరులు సంఘటితంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కుల వృత్తులు మరుగున పడకుండా వాటికి జీవం పోయాలన్నారు. 15 రోజుల్లో కుమ్మరుల భవనానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
తాను డాక్టర్‌ను కాలేకపోయానని, మీ పిల్లలను డాక్టర్లను చేయాలని మంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 12 గురుకులాలు ఉంటే రాష్ట్రం ఏర్పడిన అనంతరం 312 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్, సుధాకర్‌రావు, దయానంద్, సురేశ్, రాజు, జయమ్మ రాజు, రవి, మధుకర్, బాలయ్య, ఎగిరిశెట్టి నరేశ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, అధ్యక్షుడు మన్నె జయేందర్, ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, డైరెక్టరు పొట్టి ఆనంద్, మాజీ డైరెక్టరు సామ ప్రకాశ్‌రెడ్డి, పారిజాతం, యూత్ నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు నేదునూరులో జరిగిన చర్చి వార్షికోత్సవంలో మంత్రి సబితారెడ్డి సర్పంచ్ కాసుల రామక్రిష్ణారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు సొలిపేట అమరేందర్రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.