సిటీ బ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును 86.1 కిలోమీటర్ల విస్తరణకు రూ.19,579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్తో చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కారిడార్-1లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్-2లో జూబ్లీ బస్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్-3లో జూబ్లీ బస్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేబినెట్ తీర్మానించినట్లు తెలిపారు.