తెలుగు యూనివర్సిటీ : వినూత్న ఆలోచనలతో మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటూ స్టార్టప్ ఏకో సిస్టంలో స్థిరమైన వ్యాపారం నిర్మించడంలో మార్గదర్శకుడిగా కృషి చేయగలనని ప్రముఖ స్టార్టప్ నిపుణులు వివేక్ వర్మ అన్నారు. రెడ్హిల్స్లోగల ఎఫ్‌టీసీసీఐలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్ వర్మ పాల్గొని హైదరాబాద్‌లో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ ఏకో సిస్టం అనే అంశంపై ప్రసంగించారు. భారత దేశంలోనే స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్న తరుణంలో ఏఐ ఆధారిత మెంటార్షిప్ను అనుసంధానం చేయడం అవసరమన్నారు.
గ్లోబల్ మెంటార్షిప్ ధోరణులను గమనిస్తూ వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సంఘటిత మెంటార్షిప్ నెట్వర్క్, ప్రోత్సాహిక ప్రణాళికలు, విద్యా వ్యవస్థలలో ఇంటర్ ప్రిన్యూర్‌షిప్ కోర్సులో మెంటార్లను కనెక్ట్ చేయడం, ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్లైన్ పద్ధతిలో నైపుణ్యత కలిగిన మెంటార్లను కనెక్ట్ చేయడం వంటి అంశాలపై ఆయన లోతుగా విశ్లేషించారు. హైదరాబాద్‌లో 300 కు పైగా స్టార్టప్‌లకు తాను మార్గదర్శకుడిగా కృషి చేస్తున్నానని అన్నారు.