Star Tortoises | సిటీబ్యూరో: నక్షత్ర తాబేళ్లు…మార్కెట్లో ఒక్కో తాబేలు ఖరీదు పరిమాణం ఆధారంగా రూ.25వేల నుంచి 50వేల వరకు ఉంటుంది. అయితే మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్‌ను కొందరు స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ, కేరళ, ఒడిశా, తమిళనాడు ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాల నుంచి నక్షత్ర తాబేళ్లు, రెడ్ ఇయర్డ్ ైస్లెడర్ తాబేళ్లను తీసుకువచ్చి కొందరు స్మగ్లర్లు గుట్టచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు. సాధారణంగా ఈ తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకని అరుదైన నక్షత్ర తాబేళ్లను అక్వేరియంలోగాని, ఇండ్లలో గాని పెంచడం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ 1972 చట్టం ప్రకారం నేరమని హైదరాబాద్ ఈస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ తెలిపారు.
సాధారణంగా నక్షత్ర తాబేళ్లకు మార్కెట్లో, విదేశీ మార్కెట్లో చలా డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో వీటిపై ఉన్న సెంటిమెంట్. నక్షత్ర తాబేళ్లు ఇళ్లలో, కార్యాలయాల్లో ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుందని, ఆరోగ్య పరంగా కూడా అన్ని విధాలా మంచి జరుగుతుందనేది ప్రజల విశ్వాసం. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని స్మగ్లింగ్ ముఠాలు అరుదుగా కనిపించే నక్షత్ర తాబేళ్లు, రెడ్ ఇయర్డ్ ైస్లెడర్ తాబేళ్లను పట్టుకుని ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు.
దేశంలోని కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఈ తాబేళ్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒడిశాచ, కేరళ, తమిళనాడు, ఏపీ ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఈ తాబేళ్లు కనిపిస్తుంటాయి. అయితే ఇవి గుడ్లు పెట్టే సమయంలో బయటకు వస్తాయని, గుడ్లు పొదిగిన తరువాత అవి సముద్రంలోకి వెళ్లే సమయంలో వేటగాళ్లు కాపుకాచి ఈ నక్షత్ర తాబేళ్ల పిల్లలను పట్టుకుని వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న ముఠాను అటవీశాఖ, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా కలిసి దాడులు జరిపి పట్టుకున్నారు.
అరుదైన నక్షత్ర తాబేళ్లను మార్కెట్లో విక్రయించడం చట్టరీత్యా నేరం. నక్షత్ర తాబేళ్లను ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుందనేది ఒక మూఢ నమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలతో స్వేచ్ఛగా జీవించాల్సిన జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. ఈ మూఢ నమ్మకాలతోనే ఇప్పుడు నక్షత్ర తాబేళ్లు సైతం అరుదైన జీవరాశుల జాబితాల్లో చేరాయి. ప్రజల నమ్మకాన్ని కొందరు స్మగ్లర్లు స్వేచ్ఛగా బతకాల్సిన జీవరాశులతో వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటూ వాటి పతనానికి కారణమవుతున్నారు. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకొని జీవరాశులను కాపాడాలి.