కొండాపూర్, మార్చి 31 : శ్రీరాముని పై ఉన్న భక్తిని వినూత్న రీతిలో వ్యక్తం చేసింది ఓ భక్తురాలు. చందానగర్ సురక్ష ఎన్క్లేవ్ లో నివాసముండే విష్ణు వందన శ్రీ రాముని పై భక్తిని చాటుతూ 2016 నుంచి బియ్యం గింజల పై రామనామం లిఖిస్తూ వాటిని రాములోరి కల్యాణంలో తలంబ్రాలుగా పలు ఆలయాలకు అందజేస్తుంది. తన భక్తిని చాటుతూ నేటి వరకు 10,75000ల బియ్యపు గింజలపై రామ నామాన్ని లిఖించినట్లు తెలిపింది.
కాగా ఈ సంవత్సరంలో 1,75000ల గింజలపై రామ నామాన్ని రాసి 60 ఆలయాలకు చేరవేసినట్లు తెలిపింది. తలంబ్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టా ల్లోని ఆలయాల్లో ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంలో వాడుతుండడం సంతోషంగా ఉందన్నారు.