నియోజకవర్గం వ్యాప్తంగా సీతారాముల కల్యాణం
పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
ఎల్బీనగర్,ఏప్రిల్ 10:ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు గా పలు కూడళ్ల వద్ద జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,ఎమ్మెల్సీలు మల్లేశం కురు మ, దయానంద్ గుప్త, ఎంపీ రేవంత్‌రెడ్డి, టూరిజం అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్త, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్లు, మా జీ కార్పొరేటర్లు, పార్టీల,సంఘాల నాయకులు ఉన్నారు.