హైదరాబాద్: నగరంలో బంజారాహిల్స్లో (Banjarahills) అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటినతర్వాత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు టైరు ఊడిపోయింది. కాగా, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.