‘ప్రజా పాలన’కు ఏర్పాట్లు పూర్తి
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జీహెచ్ఎంసీ సర్కిల్-18లో చేపట్టనున్న ‘ప్రజా పాలన’ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ జోనల్ కమిషనర్ వెంకటేష్ ధోత్రేతో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
- అధికారులతో సమీక్షించిన కమిషనర్ రోనాల్డ్ రాస్
బంజారాహిల్స్,డిసెంబర్ 26: జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జీహెచ్ఎంసీ సర్కిల్-18లో చేపట్టనున్న ‘ప్రజా పాలన’ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ జోనల్ కమిషనర్ వెంకటేష్ ధోత్రేతో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ. జలమండలి, రెవెన్యూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా బస్తీలు, లోకాలిటీల వారీగా అధికారులు పర్యటించడంతో పాటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సర్కిల్ పరిధిలో 16 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, సర్కిల్‌కు ప్రత్యేక అధికారిగా దయానంద్‌ను నియమించామని పేర్కొన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది మంది సిబ్బందితో పాటు నోడల్ అధికారి దరఖాస్తుల స్వీకరణ పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం నోడల్ అధికారిని నియమించారు. వివిధ పథకాలకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌తో పాటు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాట్లు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాల్సి ఉంటుంది.
సర్కిల్-18 పరిధిలో ప్రజా పాలన కేంద్రాలు ..
- సర్కిల్-18 పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం కోసం మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
- బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్, ఉదయ్‌నగర్ కమ్యూనిటీహాల్, ఎన్బీనగర్ కమ్యూనిటీహాల్, ప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
- వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7లోని మీ సేవ కేంద్రం, దేవరకొండ బస్తీ కమ్యూనిటీహాల్, సుఖ్‌దేవ్‌నగర్ కమ్యూనిటీహాల్, దూద్కానా బస్తీ కమ్యూనిటీహాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
- జూబ్లీహల్స్ డివిజన్లో జూబ్లీహిల్స్‌లోని వార్డు కార్యాలయం, బీజేఆర్‌నగర్‌లో కమ్యూనిటీహాల్, జవహర్ కాలనీలో కమ్యూనిటీహాల్, గౌతమ్‌నగర్‌లోని కమ్యూనిటీహాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు.
- షేక్‌పేట డివిజన్ పరిధిలోని షేక్‌పేట స్పోర్ట్స్ కాంప్లెక్స్, విరాటనగర్లో కమ్యూనిటీహాల్,బీజేఆర్‌నగర్‌లో కమ్యూనిటీహాల్, ఇందిరాగాంధీ కమ్యూనిటీహాల్ తదితర ప్రాంతాల్లో తొలిదశలో ప్రజా పాలన కొనసాగుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

