శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 07:38:06

గర్భిణి కోసం స్పెషల్‌ ట్రైన్‌

గర్భిణి కోసం స్పెషల్‌ ట్రైన్‌

ఈ నెల 13.. రాత్రి  10 గంటలు. నగరమంతా భారీ వర్షం కురుస్తున్నది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. 8 నెలల గర్భిణి మియాపూర్‌ వెళ్లేందుకు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చింది. అప్పటికే ట్రైన్లు నిలిపేయడంతో వెనక్కి వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. తాను ఎటూ వెళ్లే పరిస్థితిలో లేనని వేడుకోవడంతో ఫోనులో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి వివరించారు. ఆయన ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేసి గర్భిణిని మియాపూర్‌ స్టేషన్‌కి చేర్చారు. విపత్తు సమయంలో తనను  సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన మెట్రో సంస్థకు    ఆమె కృతజ్ఞతలు తెలిపింది. గర్భిణి కష్టం చూడలేక ఒక్కరి కోసమే స్పెషల్‌ ట్రైన్‌  నడుపడం దేశంలోనే ఫస్ట్‌ అని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శుక్రవారం తెలిపారు. బతుకమ్మ పండుగ మొదలు సంక్రాంతి వరకు మెట్రో జర్నీపై 40 శాతం రాయితీని ప్రకటించి ప్రయాణికులకు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు.