సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని జోన్లలో ఎస్ఓటీ , సీసీఎస్, షీటీమ్స్‌తో పాటు స్థానిక పోలీసు స్టేషన్లకు చెందిన బృందాలు కలిసి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అంతే కాకుండా పబ్బులు, ఫామ్‌హౌస్‌లు, క్లబ్బులు తదితర 510 ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో 14మందికి గంజాయి పాజిటివ్ రావడంతో వారిపై కేసులు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండ్డు పబ్బులపై, ఓపెన్ బూజింగ్ పాల్పడుతున్న 15మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ఒక ఫామ్‌హౌస్‌పై, వ్యభిచారానికి సంబంధించి 26కేసులు, న్యూసెన్స్‌కు సంబంధించి 57కేసులు, ఎన్డిపిఎస్ వినియోగదారులపై 2కేసులు, ఆబ్కారీ చట్టం కింద 6కేసులు, ట్రిపుల్ రైడింగ్ కింద 2కేసులు, వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్‌లేని వారిపై 18కేసులు, గ్యాంబ్లిక్ చట్టం కింద ఒకటి, పిటా చట్టం కింద మరో కేసును నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.