Property Tax | బేగంపేట్, ఫిబ్రవరి 21 : ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం పిటిపి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి సమ్మయ్య గారు తెలిపారు.
శుక్రవారం ఆయన సర్కిల్ కార్యాలయంలో మాట్లాడారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆస్తి పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు, ఆస్తిపన్ను సవరణలు, కోర్టు కేసెస్ టాక్స్‌కు సంబంధించిన ఏ సమస్య అయినా బేగంపేట జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయానికి వచ్చి తెలపాలని సూచించారు. ప్రాపర్టీ టాక్స్ పరిష్కార కార్యక్రమం ఈనెల 22న, మార్చి 1, 8, 15, 22 , 29 తేదీల్లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సర్కిల్ ఆఫీస్‌లో తీసుకోబడును అని ఆయన తెలిపారు.