సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులకు బస్ పాసులు జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి కొనసాగనున్నది. అందులో భాగంగా మరో ఐదు రోజులు దివ్యాంగులకు బస్ పాసుల జారీ తేదీలను పొడిగించారు. ఈ క్రమంలో షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు గ్రేటర్లో ఆరు కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రకటించిన తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పని చేస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.