సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మహిళా ప్రత్యేక బస్సులు ఈ నెల 2 నుంచే రోడ్లపై తిప్పుతున్నారు. గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న బస్సులతో పాటు నగర శివార్లలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యార్థినులు, ఉద్యోగులు, సిబ్బంది కోసం లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ స్పెషల్ బస్సులను ఉప్పల్ ఎక్స్‌రోడ్ నుంచి బోగారానికి ఉదయం 8.10, 8.30 గంటలకు, బోగారం నుంచి సికింద్రాబాద్‌కు ఘట్కేసర్ మీదుగా సాయంత్రం 4.30, 5.00 గంటలకు ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం ఉదయం 7.35, 8.35 గంటలకు, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్కు సాయంత్రం 4, 4.15 గంటలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీపట్నం- గురునానక్ యూనివర్సిటీ ఉదయం 8, 8.15 గంటలకు, ఇబ్రహీంపట్నం-గురునానక్ యూనివర్సిటీ నుంచి ఎల్బీనగర్కు సాయంత్రం 4.20, 4.30 గంటలకు స్పెషల్ బస్సులను నడిపిస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు వెల్లడించారు.