సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టినట్టు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య పోటీ ఉండనున్నది. ఏప్రిల్ 6, 12, 23 మే 5, 10, 20, 21న మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భాగంగా మ్యాచ్‌లు జరిగే రోజు బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఘట్కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, లక్డీకాపూల్, దిల్‌సుక్‌నగర్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, మియాపూర్, జేబీఎస్, హఫీజ్‌పేట, ఈసీఐఎల్, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వివరించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.