హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనల(Traffic rules)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్సీఎస్సీ ద్వారా ట్రాఫిక్‌పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) అన్నారు. నగరంలో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్(Traffic Security Week)ను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలు తొలగించడానికి అధికారులు సిద్ధం కావాలన్నారు. అలాగే క్విజ్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సరికొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని ఆయన సూచించారు.