వికారాబాద్: జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు కాంగ్రెస్ హై కమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న స్పీ కర్ ప్రసాద్‌కుమార్‌కు త్వ రలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖరారైనట్టు ఆయన వర్గం నా యకుల ద్వారా తెలిసింది.
ఇప్పటికే కర్ణాటకలో సీఎం మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణకు ఆ పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, త్వరలో తెలంగాణలోనూ మంత్రివర్గ విస్తర ణ జరగనున్నదనే ప్రచా రం ఊపందుకున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో వరుస భేటీలతో రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని కోరిన ఆయన.. శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనూ కలిశారు.
మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించాలనే దానిపై ఆలోచన చేస్తున్న ఆ పార్టీ హైకమాండ్.. ఎవరిని కేబినెట్ నుంచి తొలగించి.. ఏ శాఖను కేటాయిస్తారోనని జిల్లాలో చర్చ జరుగుతున్నది. కాగా, స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమకూ మంత్రి పదవి కావాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు.