Raja Singh | మెహిదీపట్నం జూన్ 1 : గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు కీలక నోటీసులు జారీ చేశారు. భద్రతా సిబ్బంది లేకుండా బయట తిరగవద్దని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆదివారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు.
రాజా సింగ్ ఆదివారం ఉదయం ఒంటరిగా బుల్లెట్‌పై తిరుగుతూ కనిపించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా ఆయనకు నోటీసులిచ్చారు. ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తరచుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని, భద్రత సిబ్బంది లేకుండా తిరగవద్దని డీసీపీ చంద్రమోహన్ సూచిస్తున్నారు.