మన్సూరాబాద్, జనవరి 29: ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి శివారు కాలనీల్లో ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. యూజీడీ ట్రంకులైన్ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షా కాలంలో మురుగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి లెక్చరర్స్‌కాలనీ, బాలాజీనగర్, త్యాగరాయనగర్, కేవీఎన్ రెడ్డి కాలనీ, ఆదిత్యనగర్, శ్రీరాంనగర్, లక్ష్మీభవానీ కాలనీ, ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్-2, సిరిహిల్స్, రాజరాజేశ్వరి కాలనీ, శివగంగాకాలనీ, స్వాతి రెసెడిన్సీ, అంజలి రెసిడెన్సీ, పవనగిరికాలనీ ఫేజ్-1,2,3, వీరన్నగుట్ట కాలనీల్లో ఎమ్మెల్యే ఆదివారం ఉదయం ‘మార్నింగ్ వాక్’ నిర్వహించిన ఆయన అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలాజీనగర్ కాలనీ నుంచి దిగువకు ఉన్న సుమారు పదిహేను కాలనీల యూజీడీ ట్రంకులైన్ పూర్తి కాగానే అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. మన్సూరాబాద్, హయత్‌నగర్ పరిధిలో 38 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, ప్రతి రోజు 300 మీటర్ల చొప్పున పైపులైన్ వేసి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడని పేర్కొన్నారు. మే నెల లోపు హయత్‌నగర్ పరిధిలోని ప్రతి కాలనీకి తాగునీటి సౌకర్యం లభించబోతుందని తెలిపారు. విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న క్రీడా ప్రాంగణం నుంచి వచ్చే వరదనీటితో సుమారు పదిహేను కాలనీల ప్రజల ఇబ్బందులు పడుతున్న విషయం తనకు తెలుసునని.. ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు త్వరలో బాలాజీనగర్ నుంచి దిగువకు బాక్స్‌టైప్ ట్రంకులైన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు.
యూజీడీ, తాగునీటి, వరదనీటి పైపులైన్ల పనులు పూర్తవ్వగానే పైన పేర్కొన్న కాలనీల్లో వీడీసీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతామని ప్రజలకు ఆయన హామీనిచ్చారు. బొమ్మలగుడి నుంచి విజయవాడ జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో కొందరు వ్యక్తులు రోడ్లను ఆక్రమించే విధంగా ర్యాంపులు నిర్మించడం వలన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కొందరికి కష్టం అనిపించినప్పటికీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రోడ్డుకు ఇరువైపుల వేసిన ర్యాంపులను తొలగింపజేస్తామని పేర్కొన్నారు. ‘మార్నింగ్ వాక్’ సందర్భంగా చిన్న చిన్న సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని యుద్ధ ప్రాతిపధికన పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజీర్ వినోద్, ఏఈ రాజు, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, పోచబోయిన జగదీశ్‌యాదవ్, టంగుటూరి నాగరాజు, రుద్ర యాదగిరి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, కొసనం వెంకట్‌రెడ్డి, పారంద నర్సింగ్‌రావు, కేకేఎల్ గౌడ్, సిద్దగౌని జగదీశ్‌గౌడ్, రమేశ్, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలి
యువతరం సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మె ల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సాహెబ్‌నగర్ ‘క్రాంతి యువజన సంఘం’ భవన నిర్మాణానికి రూ.71లక్షలు మంజూరయ్యాయి. దీంతో సంఘం నాయకుడు కొంగర మహేశ్ ఆధ్వర్యంలో యువకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదా లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. మన దేశం, మన రాష్ట్రం గురించి సరైన ఆలోచన చేయాలన్నారు. యువకులకు తానెప్పుడు అండగా ఉంటానని, వారి కోసం క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ ఫూళ్లు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, సంఘం సభ్యులు కొంగర భిక్షపతి, నర్సింహ్మా, మాన య్య, నర్సింహ్మా, లక్ష్మయ్య, యాదగిరి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.