దోమ, ఏప్రిల్ 7: దోమ పోలీస్‌స్టేషన్ పరిదిలోని ఖమ్మంనాచారం గ్రామానికి చెందిన బోయిని మొగులయ్య(60) హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చారు. నిందితుడు మోత్కూర్ గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేష్ మేస్త్రీ పని చేస్తూ జీవనం గడిపేవాడు. మల్లేశ్ అతని భార్య దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు పడేవారు.
ఒక రోజు ఇద్దరి మధ్య గొడవ జరిగి మల్లేశ్ భార్య తల్లిగారి ఊరైన ఖమ్మనాచారం వెళ్లింది.అప్పుడు మృతుడు మామ మొగులయ్య సర్ది చెప్పి ఆమెను అత్తగారింటికి పంపాడు. మరలా కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవ జరగగా మామ మొగులయ్య మల్లేష్ భార్యను ఖమ్మంనాచారం గ్రామానికి తీసుకువెళ్లి తిరిగి ఆమెను పంపలేదు. మూడు నెలలుగా మల్లేష్ ఒక్కడే నివాసం ఉం టున్నాడు. దీనితో నేరస్తుడు మామపై పగ పెంచుకొని చంపాలని నిర్ణయించుకున్నాడు.
మల్లేశ్ శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పొలంలో గల గుడిసెలో ఉన్న గొడ్డలి తీసుకొని ఆవుల షెడ్డులో నిద్రిస్తున్న మామ మొగులయ్యను తలపై ముఖంపై గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ గొడ్డలిని తీసుకొని పారిపోతూ మార్గ మద్యం లో పొదల్లో పారేశాడు. గొడ్డలిని స్వాధీనం చేసుకొని మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, దోమ ఎస్సై నాగెందర్లు తెలిపారు.