సిటీబ్యూరో: పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, కూతురికి మరణ శిక్ష, సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధిస్తూ కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం సంచలన తీర్పు వెల్లడించారు. మల్కాజిగిరి, కృష్ణానగర్, ఆర్టీసీ కాలనీలో నివాసముండే కిషన్ మారుతీ సుథార్(70) రిటైర్డు రైల్వే ఉద్యోగి. ఆయన భార్య గంగాభాయ్, కొడుకు కిషన్ సుథార్ అలియాస్ రాహుల్, కూతురు ప్రపుల్ల. తండ్రి తనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని పిల్లలు అతడిపై కోపం పెంచుకొని, తల్లి సహకారంతో అతడిని హత్య చేశారు. మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేశారు. కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. నిందితులు హత్య చేసినట్లు బలమైన సాక్ష్యాలు ఉండడంతో న్యాయస్థానం.. కిషన్ సుథార్, ప్రపుల్లకు ఉరిశిక్ష, గంగభాయ్కి జీవిత ఖైదు విధించింది.