మేడ్చల్, ఏప్రిల్ 21: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సు కు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో ఉపేందర్, ఇన్చార్జి తాహసీల్దార్ సునీల్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి, నాయకులు సుధీర్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
మేడ్చెల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడికి మేడ్చెల్ జిల్లా ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, రామక్రిష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. భాభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
స్లాట్ బుకింగ్‌ను రద్దు చేయాలి
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మేడ్చల్ దస్తావేజు లేఖరులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం మేడ్చల్‌కు వచ్చిన మంత్రికి వినతిపత్రం ఇచ్చిన దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ..స్లాట్ బుకింగ్ కారణంగా తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమ సమస్యను సీఎంకు వివరించాలని మంత్రిని కోరారు.