కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 1: జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాను, ప్రేమలో విఫలమైయ్యాను..నా చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ.. సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్ఐ రూప తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు.
ఉద్యోగానికి రాజీనామా చేసి పండుగకు ఊరేళ్ల కుండా అక్కడే ఉండిపోయాడు. సోమవారం హాస్టల్ గది నుంచి బయటికి రాకుండా తలుపులు వేసుకోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు పరిశీలించగా మహేందర్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా అక్కడ సూసైడ్ నోట్ లభించింది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు.